నల్లగొండ,సూర్యాపేట జిల్లాల కలెక్టర్ల బదిలీ

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన ఐఏఎస్( IAS ) ల బదిలీలలో రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు.

ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న దాసరి హరిచందన (2010) స్థానంలో నూతన కలెక్టర్ గా వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి( Collector Narayana Reddy ) (2015)ని నియామకం చేశారు.

నల్లగొండ నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టబోయే నారాయణరెడ్డి గతంలో నల్లగొండ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పని చేయడం గమనార్హం.

అలాగే సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావు(2015) బదిలీ కాగా,ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

దుబాయ్: 5-స్టార్ రిసార్ట్ బాల్కనీలో బట్టలు ఎండేసిన ఇండియన్ మహిళ.. చివరికి?