నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

ఖమ్మం జిల్లా పరిధిలోని యువతి,యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న పోలీసు,ఇతర ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ నేపథ్యంలో ఉత్సాహవంతులైన జిల్లా యువతి యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్ధానిక యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఎస్.ఐ/ కానిస్టేబుల్/ ఇతర ఉద్యోగాల శిక్షణ కోసం ఈనెల 29 నుండి ఏప్రియల్ 3వ తేది లోపు అర్హులైన (ఎత్తు,విద్యార్హతలు, వయస్సు ) యువతి యువకులు పూర్తి వివరాలతో స్దానిక పోలీస్ స్టేషన్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

పేరు నమోదు చేసుకున్న వారందరికి స్దానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ( వ్రాత పరీక్ష) ఉంటుందని తెలిపారు.

ఎంపిక పరీక్షలో ప్రతిభ కనపర్చి అర్హత అభ్యర్ధులకు ఏప్రియల్ 18 వతేది నుండి శిక్షణ తరగతులు వుంటాయని తెలిపారు.

సుశిక్షితులైన సిబ్బందిచే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగకరమైన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.

కావున జిల్లాలోని అసక్తి కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.

అవినీతి గురించి జగన్ మాట్లాడడమా..? లోకేష్ సెటైర్లు