మిషన్ తెలంగాణ-23 పేరుతో కాంగ్రెస్ నేతలకు శిక్షణ
TeluguStop.com
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది.‘మిషన్ తెలంగాణ -2023’ పేరుతో టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో కోఆర్డినేటర్ ను టీపీసీసీ నియమించింది.ఈ క్రమంలో ప్రచారానికి వెళ్లి కోఆర్డినేటర్లు చేయాల్సిన విధులపై పీసీసీ అవగాహన కల్పించింది.
బూత్ స్థాయి ఏజెంట్లు డివిజన్ స్థాయి నేతలతో రోజూ టచ్ లో ఉండాలని పేర్కొంది.
అలాగే కాంగ్రెస్ హామీలను, గ్యారెంటీలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది.బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే మీడియా సమావేశాల ద్వారా బయటపెట్టాలని తెలిపింది.
దాంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేయాలని పీసీసీ స్పష్టం చేసింది.
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?