జిల్లా ఏరువాకా కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ, అవగాహనా సదస్సు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలో వరిలో నేరుగా విత్తే పద్దతిలో కలుపు యాజమాన్యం పై శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఏరువాక కేంద్రం, కోఆర్డినేటర్ డా.కె.

మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాటు వేసిన వరిలో మొదటి 30 రోజులు, నేరుగా విత్తిన వరిలో మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

ముఖ్యంగా నేరుగా వరి విత్తే పద్దతిలో విత్తనం వేసిన 2 రోజుల లోపు వెడల్పాకు కలుపు మొక్కలు, ఏకవార్షిక గడ్డి, తుంగ నివారణకు పెండిమిథాలిన్ 1.

3 లీటర్ మందుని మరియు పంట విత్తిన 3-5 రోజుల లోపు ప్రెటిలాక్లోర్ (600-800 మి.

లీ.) లేదా పైరజోసల్ఫ్యురాన్ ఈథైల్ (80 గ్రాములు) లేదా ప్రెటిలాక్లోర్ + పైరజోసల్ఫ్యురాన్ ఈథైల్ (800 గ్రాములు) మందుని పొలం అంత సమానంగా వెదజల్లాలి.

కలుపు 2-4 ఆకుల దశలో (10-15 రోజుల దశలో) ఉన్నప్పుడు బిస్పైరిబాక్ సోడియం (100 మి.

లీ.) లేదా సైహలోఫాప్ బ్యూటైల్ (300 మి.

లీ.) లేదా పెనాక్సులం (400 మి.

లీ.) లేదా పెనాక్సులం + సైహాలోఫాప్ బ్యూటైల్ (800 మి.

లీ.) లేదా ట్రయాఫమెన్ + ఇథాక్సీ సల్ఫ్యురాన్ (90 గ్రాములు) మందులను వాడి కలుపును నివారించవచ్చని తెలిపారు.

పంట నాటిన 5 రోజులలోపు సిఫారసు చేసిన కలుపు మందులను 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో పలుచటి నీళ్ళు పెట్టి చల్లుకోవాలి.

అదే విధంగా నాటిన 10 రోజుల నుండి 20 రోజుల వరకు సిఫారసు చేసిన మందులను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేయాలి.

ఆ తర్వాత జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్త డా.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం వరిలో వచ్చు చీడ పీడల యాజమాన్యం గురించి రైతులకు వివరించారు.

ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, బ్యాక్టీరియా ఎండాకు తెగులుని రైతుల పొలాల్లో గమనించడం జరిగింది.

మొగి పురుగు నివారణకు క్లోరంత్రనిలిప్రోల్ 60 మి.లీ.

మందుని ఎకరానికి వాడాలని సూచించారు.అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని ఎరువులను తాత్కాలికంగా వేయడం ఆపేయాలి, అలాగే దుబ్బు కట్టే దశ నుండి చిరు పొట్ట దశలో ఈ తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు+ (స్ట్రెప్టోమైసిన్+టెట్రాసైక్లిన్) లేదా స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 0.

4 గ్రాములు మందుని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.తదనంతరం రైతుల పొలాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి లలిత, రావేప్ విద్యార్థినిలు,రైతులు పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ చరణ్ రైమ్ ను అడిగిన నెటిజన్… కౌంటర్ ఇచ్చిన ఉపాసన!