ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు ప్రాక్టికల్ నెలల శిక్షణ నిమిత్తం 2022 బ్యాచ్ రాహుల్ రెడ్డి ఐపీఎస్ ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించగా సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వద్ద రిపోర్ట్ చేశారు.

2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డి బి.టెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ కు ఎంపికయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు నెలల పాటు వివిధ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందనున్నారు.

అగ్రహారం జైలు నుండి బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ షిఫ్ట్.. మరింత కఠిన రూల్స్..