కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్లే దారుణమైన సంఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రతాప్ దంపతులు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలులో టీవీ మెకానిక్ గా పనిచేస్తున్న ప్రతాప్ ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
దీంతో ఒత్తిడి తట్టుకోలేక భార్య హేమలత తోపాటు పిల్లలకు విషమిచ్చి తాను తాగి ఒకేసారి చనిపోవడం జరిగింది.
కరోనా కారణంగా పుట గడవక పోవడంతో మరోపక్క వ్యాపారం లేక పోవడంతో ఆర్థిక ఒత్తిడి ఎక్కువై పోవడంతో ప్రతాప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకువ్యాపారం లేక పోవడంతో చాలావరకు మధ్యతరగతి అదే రీతిలో ఏరోజుకారోజు బతికే కూలీల పరిస్థితి కూడా ప్రస్తుత రోజుల్లో ఇబ్బందికరంగానే ఉంది.
ఇలాంటి తరుణంలో అప్పులు చేసి ఉన్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.కుటుంబంతో సతమతమవుతున్నారు.
ఈ రీతిగానే ప్రతాప్ కుటుంబం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.