హైదరాబాద్ రంజీ జట్టులో విషాద ఘటన.. గుండెపోటుతో మరణించిన ఫాస్ట్ బౌలర్.. !

ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించే వారు ఎక్కువ అవుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.

దీనికి పలు కారణాలను వైద్యులు తెలియచేస్తున్న, అలాగే గుండెపోటు రాకుండా సూచనలు ఎన్నో చేస్తున్నా గుండె ఆగడం మాత్రం మానడం లేదు.

ఇకపోతే హైదరాబాద్ రంజీ జట్టులో విషాద ఘటన చోటుచేసుకుంది మొహాలీలో 2007 లో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) ఈరోజు గుండెపోటుతో మరణించారు.

ఇదిలా ఉండగా అశ్విన్ యాదవ్‌కు క్రికెటర్‌గా తగినన్ని అవకాశాలు రాకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడని సమాచారం.

అయితే అశ్విన్ 2009 లో ముంబైతో ఆడిన రంజీ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అయ్యింది.

ఇకపోతే అశ్విన్ యాదవ్ మృతిపై భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సంతాపం వ్యక్తం చేస్తుండగా, అశ్విన్ ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విశాల్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఏది ఏమైన ఒక మంచి ఆటగాన్ని మాత్రం క్రికెట్ రంగం కోల్పోయింది.

వేరే హీరో రిజెక్ట్ చేసిన కథలతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ…