రామాంత‌పూర్ కాలేజీ ఘ‌ట‌న‌లో విషాదం..!

రామాంత‌పూర్ నారాయ‌ణ కాలేజీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో విషాదం నెలకొంది.పెట్రోల్ దాడి ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ కాలేజ్ అడ్మినిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్ అశోక్ రెడ్డి మృతిచెందాడు.

ఫీజు విష‌యంలో చెల‌రేగిన వివాదంలో ఆగ‌స్ట్ 20న కళాశాల‌లో విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మంట‌లు అంటుకుని గాయ‌ప‌డిన అశోక్ రెడ్డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.