కర్నూలు జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి
TeluguStop.com
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడితో పాటు ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు.
ఎమ్మిగనూరు మండలం సిరాళ్లాదొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది.బట్టలు ఉతకడానికి వెళ్లి ఐదేళ్ల బాలుడు ముందుగా చెరువులో పడిపోయాడు.
చిన్నారిని రక్షించే క్రమంలో సలోని, మరియమ్మ అనే మహిళలు చెరువులో పడిపోయారు.ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఏందిది, క్లాస్‌రూమ్‌లోకి వచ్చేసిన బర్రె.. డిగ్రీ చేస్తుందట.. వీడియో సీన్ చూస్తే నవ్వాపుకోలేరు!