గద్దర్ అంతిమయాత్రలో విషాదం..!!

ప్రజా గాయకుడు గద్దర్( Gaddar ) అంత్యక్రియలు ముగిశాయి.నిన్న అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో మరణించిన గద్దర్.

నీ ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో( LB Stadium ) ఉంచారు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో ప్రారంభమై ఏడు గంటల సమయంలో పూర్తయ్యాయి.

అంతిమయాత్రలో గద్దర్ పాడిన పాటలను స్మరించుకుంటూ.ఆయన కోరిక మేరకు హైదరాబాద్ అల్వాల్ లో తన పాఠశాల ఆవరణలో బౌద్ధా ఆచారం ప్రకారం ఖననం చేశారు.

ఇదిలా ఉంటే గద్దర్ అంతిమయాత్రలో ఆయనకు అత్యంత సన్నిహితుడు సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మరణించారు.

"""/" / గద్దర్ అంతిమయాత్రకి( Gaddar Final Rituals ) భారీగా.ప్రజలు తరలిరావడం జరిగింది.

దీంతో తోపులాట జరగటంతో ఉక్కిరిబిక్కిరైనా జహీరుద్దీన్ ఆలీఖాన్( Zaheeruddin Alikhan ) తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయారు.

ఆ వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.అయితే గుండెపోటుకు గురై మరణించినట్లు భావిస్తున్నారు.

జహారుద్దీన్ ఆలీ ఖాన్.గద్దర్ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

గద్దర్ భౌతిక కాయం ఎల్పీ స్టేడియం నుంచి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో ఆయన వాహనం వెంటే ఉన్నారు.

కాగా అంతిమయాత్ర ప్రారంభమైన సమయంలో ఒక్కసారిగా తోపులాట ( Stampede ) జరగటంతో ఈ విషాదం చోటు చేసుకోవడం జరిగింది.

దీంతో జహరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.