ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు న‌లుగురు మృతి

ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.లింగ‌పాలెం మండ‌లం బోగోలులో పిడుగుపాటుకు న‌లుగురు కూలీలు మృతిచెందారు.

మ‌రో ముగ్గురికి తీవ్రగాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.మృత‌దేహాల‌ను ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

జామాయిల్ క‌ర్ర‌లు తొల‌గిస్తుండ‌గా కూలీల‌పై పిడుగు ప‌డిన‌ట్లు స‌మాచారం.