నంద్యాలలో ఐఐటీ విద్యార్థి రాహుల్ ఇంటి వ‌ద్ద విషాదం

నంద్యాల జిల్లాలో ఐఐటీ విద్యార్థి రాహుల్ ఇంటి వ‌ద్ద విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.హైద‌రాబాద్ ఐఐటీలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో రాహుల్ మృతిపై స‌మ‌గ్ర విచార‌ణ చేసి న్యాయం చేయాల‌ని మృతుని తండ్రి మ‌ధుసూద‌న్ రావు కోరుతున్నారు.

అదేవిధంగా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే త‌న కొడుకు ల్యాప్ టాప్ ఓపెన్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

గ‌త నెల 27న రాహుల్ పుట్ట‌న‌రోజున లాస్ట్ వాట్సాప్ మెస్సేజ్ చేశాడ‌ని.ఆ త‌ర్వాత నుంచి ఫోన్ చేయ‌లేద‌ని వాపోయారు.

ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ జ‌రిపి రాహుల్ మృతికి గ‌ల కార‌ణాల‌ను క‌నుక్కోవాల‌ని కోరారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య…