విషాదం.. ప్ర‌యాణికుల‌తో స‌హా బావిలో ప‌డిపోయిన కారు..

ఒక ప్ర‌మాదం జ‌రిగింది అంటే దాని ఫ‌లితం ప్రాణం పోవ‌డం మాత్ర‌మే కాదు.

ఓ కుటుంబం రోడ్డున ప‌డటం.ఎక్క‌డో సినిమాలో విన్న‌ట్టు గుర్తుకు వ‌స్తుంది క‌దూ.

అవును మీరు విన్న‌ది నిజ‌మేనండి.మ‌రి అంతే క‌దా.

ప్ర‌మాదం జ‌రిగి ఓ మ‌నిషి చనిపోయాడు అంటే అత‌ని కుటుంబీకులు అనాథ‌లు అయిన‌ట్టే క‌దా.

వారికి అండ‌గా ఎవ‌రుంటారు చెప్పండి.అందుకు ప్ర‌మాదాల‌ను నివారించాల‌ని అటు అధికారులు ఎంత‌లా ప్ర‌య‌త్నిస్తున్నా కొన్ని అత్యంత దారుణ‌మైన ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి.

ఒకే ప్ర‌మాదంలో ఒక‌రికంటే ఎక్కువ మంది చ‌నిపోవ‌డం కూడా చూస్తున్నాం.అయితే అప్పుడ‌ప్పుడు రోడ్డు ప‌క్క‌న ఉండే కాల్వ‌ల్లో, లేదంటే వ్య‌వ‌సాయ బావుల్లో బైకులు, కార్లు ప‌డిపోవ‌డం చూస్తున్నాం.

ఈ విధంగా నీటిలో ప‌డిపోతే మాత్రం ఒక్క‌రూ కూడా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉండ‌ట్లేదు.

అంద‌రూ అలాగే నీటిలో మునిగిపోతున్నారు.అందుకే ఈ ప్ర‌మాదాల‌ను చూసిన‌ప్పుడు అయినా ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని కోరుకుందాం.

ఇప్పుడు దుబ్బాక మండ‌లంలోని చిట్టాపూర్‌ శివారులో ఇలాంటి దారుణ‌మే చోటుచేసుకుంది.రోడ్డు ప‌క్క‌నే ఉండే ఓ వ్య‌వ‌సాయ బావిలో కారు ప‌డిపోయింది.

దీంతో అందులో ఉన్న‌వారు కూడా మునిగిపోయారు. """/" / కాగా కారు స్పీడుగా రావ‌డం వ‌ల్ల అదుపుతప్పి బావిలో ప‌డిపోయిన‌ట్టు గుర్తిస్తున్నారు పోలీసులు.

బావిలో  ఓ టైర్ తేలుతోంది.కానీ కారు మాత్రం నీటిలోనే మునిగిపోయి ఉంది.

అందులో ఉన్న వారు కూడా అలాగే ఉన్నార‌ని తెలుస్తోంది.బావి నిండా నీరు ఉండ‌టంతో అస‌లు ఎంత‌మంది ప‌డిపోయారో తెలియ‌రావ‌ట్లేదు.

కాగా రోడ్డు ప‌క్క‌నే ప్ర‌మాద‌క‌రంగా వ్యవసాయ బావి ఉండ‌టం మూలంగా స‌రిగా గ‌మ‌నించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని చెబుతున్నారు పోలీసులు.

కారును బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.కారు బ‌య‌ట‌కు వ‌స్తేనే ఎంత‌మంది ప‌డిపోయార‌నేది తెలుస్తుంది.

ట్రంప్, బైడెన్ సరే.. అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన మరో నలుగురు ఎవరు..?