హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకల వేళ ట్రాఫిక్ ఆంక్షలు..!!
TeluguStop.com
హైదరాబాద్ మహానగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకురానున్నారు పోలీసులు.ఈ క్రమంలోనే పలు ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.
ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్ల మూసివేత కొనసాగుతుంది.
రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.అలాగే డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించేందుకు గానూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
అలాగే ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న బాబీ…