రేపు హైదరాబాద్‎కు మోడీ రాక..ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు.

రేపు ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు.రెండు రోజుల పాటు రాజ్ భవన్ లోనే బస చేస్తారు.

దీనికి సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇవాళ రాత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిలతో నడ్డా సమావేశమవుతారు.

రేపు, ఎల్లుండి జరిగే కార్యవర్గ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై ముసాయిదాను రూపొందిస్తారు.బీజేపీ జాతీయ అగ్రనాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాతోపాటు, కేంద్ర మంత్రులు, మూడు వందల అరవై మంది జాతీయ ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.

రెండు రోజుల క్రితమే పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలందరూ హైదరాబాద్ చేరుకున్నారు.

రెండు రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి నేతల సమీక్షించారు.హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రేపు, ఎల్లుండి జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

రెండు, మూడు తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. """/" / కార్యవర్గ సమావేశాలు ముగిసిన తరువాత మూడవ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు.

ఈ బహిరంగ సభలో మోదీ తో పాటు బీజేపీలోని కీలక నేతలంతా పాల్గొంటారు.

ఈ బహిరంగ సభకు పది లక్షల మందిని తరలించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.

పరేడ్ గ్రౌండ్ కాషాయమయంతో ముస్తాబయింది.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

జెడ్‌ ప్లస్ కేటగిరి ఉన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

ఇక ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు.

కాంగ్రెస్ చెప్పేవన్నీ బోగస్ మాటలే..: హరీశ్ రావు