ట్రాఫిక్ పోలీస్ వీరంగం.. గొడ్డలితో బైకర్లను బెంబేలెత్తించాడు..!

పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తూ సాధారణ జనాలకు హడల్ పుట్టిస్తున్నారు.వీరు తమ డ్యూటీకి విరుద్ధంగా అమాయకులను చితకబాదుడు బాదుతూ అందరి ఆగ్రహానికి గురి అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాడు.

ఈ షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో చోటు చేసుకుంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక బైక్‌పై ముగ్గురు అబ్బాయిలు కనిపించారు.

అంతలోనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వారి వైపు ఉరికారు.అతని చేతిలో ఒక గొడ్డలి ఉంది.

ఆ యువకులను గొడ్డలితో భయపెడుతూ అతను పెద్ద రచ్చ చేశారు.వారిని కాలితో తన్నుతూ తన అహంకారాన్ని ప్రదర్శించారు.

ఈ బైక్ రైడర్లు హెల్మెట్‌ ధరించలేదు, అలానే లిమిట్ కి మించి ప్రయాణం చేస్తున్నారు.

అందుకే పోలీసు వారి పైకి గొడ్డలితో విరుచుకుపడ్డారు.సాధారణంగా ఇలాంటి తప్పులు చేస్తే ఫైన్ విధిస్తే సరిపోతుంది కానీ గొడ్డలి పట్టుకుని మర్డర్ అటెంప్ట్ చేసినట్టు భయ పెట్టడం సరికాదు.

మంగళవారం పొద్దున సమయంలో ఫరిదాబాద్‌లోని బాటా చౌక్‌లో పోలీస్ ఈ విధంగా గొడ్డలితో తిరుగుతూ హల్చల్ చేశారు.

వీడియో వైరల్‌గా మారిన తర్వాత ఈ ఘటన ఉన్నత అధికారుల దృష్టికి కూడా వచ్చింది.

దాంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, ట్రాఫిక్ పోలీస్ ఆ గొడ్డలిని వాహనదారుల నుంచి లాక్కున్నారట.

అసలు ఇలా ఎందుకు లాక్కున్నారు, వాహనదారులను గొడ్డలితో బెదిరించడమేంటి? అనే విషయాలు పూర్తి స్థాయిలో తెలుసుకొని అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఒక ఉన్నత పోలీసు అధికారి వెల్లడించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

సినిమాలు వేల కోట్లు సాధిస్తున్నా ఏ మాత్రం గర్వం లేని హీరో ప్రభాస్.. గొప్పోడంటూ?