సీఎం జగన్ అభిమానికి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

సీఎం జగన్ అభిమానికి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

కొంత మంది ప్రజలకు తాము అభిమానించే నాయకులు, సినీ తారలంటే ఎనలేని అభిమానం చూపిస్తుంటారు.

సీఎం జగన్ అభిమానికి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

కొందరు తమ శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకుంటారు.ఇంకొందరు తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకుంటుంటారు.

సీఎం జగన్ అభిమానికి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

వారి పుట్టిన రోజులు వచ్చినప్పుడు బైక్‌లపై ఊరంతా తిరుగుతూ హోరెత్తిస్తుంటారు.ప్లెక్సీలు కట్టి, పాలాభిషేకం చేస్తారు.

కేక్ కటింగ్‌ చేసి ఊరందరికీ పంచుతుంటారు.అభిమానం అంతలా వారికి తలెకెక్కుతుంది.

ఇంకొందరు సేవా కార్యక్రమాలు చేపడతారు.అన్నదానం, వస్త్రదానం తమకున్న స్థాయిలో చేస్తుంటారు.

మరికొందరు రక్తదానం చేసి, అభిమానాన్ని చాటుకుంటారు.ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ కొందరు బైక్‌ల నంబరు ప్లేట్లపై తమ అభిమాన నాయకుల, తారల ఫొటోలు పెట్టుకోవడం వివాదాస్పదం అవుతోంది.

అలాంటి ఓ వ్యక్తికి ఇటీవల ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు.దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖపట్నం నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వస్తుండగా అతడిని ఆపారు.

అతడి నంబరు ప్లేటు చూసి షాక్ అయ్యారు.సీఎం వైఎస్ జగన్ బొమ్మ ఉండడంతో ఆ బైక్‌ను పక్కకు పెట్టారు.

నంబరు ప్లేట్‌పై సీఎం జగన్ బొమ్మ తీసేశారు.నిబంధనలకు విరుద్ధంగా అలా పెట్టుకోవడం తగదని స్పష్టం చేశారు.

ఇలా నాయకుల బొమ్మలు నంబరు ప్లేట్లపై పెట్టుకునేందుకు నిబంధనలు అంగీకరించవని చెప్పారు.అయితే ఆ బైక్‌ యజమాని తాను సీఎం జగన్‌కు వీరాభిమానినని, దయ చేసి జగన్ బొమ్మ తీయొద్దని గట్టిగా అరిచాడు.

నానా హంగామా చేశాడు.అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఏ మాత్రం బెదరలేదు.

తమ పని తాము చేసుకుపోయారు.ఇలాంటివి ఎక్కడ కనిపించిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కాబోయే భార్యతో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న అఖిల్… దిష్టి తీయమంటున్న ఫ్యాన్స్!