విన్యాసాలు చేసి తప్పిచుకోవడం కంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఉత్తమం..

సిటీలో బండి నడపడమంటే అంత ఆషామాషీ విషయం కాదు.ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువుగా ఉంటుంది.

మనం సరిగ్గా నడుపుతున్న మన పక్కన వాళ్ళు ఎలా నడుపుతారో తెలియదు.పోకిరీలు రూల్స్ అస్సలు పాటించారు.

హెల్మెట్స్ పెట్టుకోరు.డబల్ కాదు ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు.

నిభందనలు పాటించకపోయే వాళ్ళ వల్ల మిగతావారు కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.యాక్సిడెంట్ లాంటివి జరిగితే కుటుంబమంతా జీవితాంతం బాధపడాలి.

కానీ ఇలాంటివి ఎన్ని జరిగిన యువతలో మార్పు రావడం లేదు.ఇంకా రోజు రోజుకు ఇలాంటివి ఎక్కువవుతున్నాయి.

తాజాగా జరిగిన ఒక సంఘటనను సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటనను నవ్వు తెప్పించే విధంగా ట్వీట్ చేసారు.అంతేకాదు ఈ ట్వీట్ ద్వారా ఒక హెచ్చరిక కూడా చేసారు.

"""/"/ బుధవారం రోజు సైబరాబాద్ పోలీసులు ఒక ట్వీట్ ను చేసారు.అందులో ఒక బైక్ మీద ముగ్గురు కూర్చుని వెళ్తున్నారు.

బండి నడిపే అతనికి హెల్మెట్ ఉంది.కానీ వెనకాల ఇద్దరూ హెల్మెల్ పెట్టుకోలేదు.

అయితే వెనక కూర్చున్న అమ్మాయి బైక్ కు చలాన్ పడకుండా ఉండాలని తన కాలును తీసి నెంబర్ ప్లేట్ మీద పెట్టింది.

ఇక్కడ వరకు బాగానే ఉన్న పోలీసులకు మాత్రం చిక్కారు.అయితే ట్రాఫిక్ పోలీసులు వారికి వెయ్యవలసిన దానికంటే ఎక్కువ చలానా వేశారు.

వంద రెండొందలు కాదు ఏకంగా 1500 రూపాయిలు ఎక్కువుగా వేశారు.ఈ విషయాన్నీ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేసారు.

మాములుగా కాకుండా అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ మీమ్ ను షేర్ చేసారు.

అందులో ఏమని రాసారంటే.‘నువ్వేమో రూ.

1,300 లు కాపాడదాం అని కాలు పెట్టావ్.కానీ నువ్వు చేసిన పనికి మరో రూ.

1,500 అదనంగా పడ్డాయి.’ అని పోస్ట్ చేశారు.

బైక్ యజమానికి బండి వివరాలు కనిపించకుండా చేసినందుకు గానూ రూ.500, ప్రమాదకర డ్రైవింగ్ కు రూ.

1,000.ట్రిపుల్ రైడింగ్ కు రూ.

1,200.వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.

100 ఫైన్ మొత్తం రూ.2,800 జరిమానా విధించినట్లు తెలిపారు.

రూ.2 కోట్ల సాయంతో బన్నీపై కోపం తగ్గినట్టేనా.. ఆ కేసు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా?