వైరల్ వీడియో: ” పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ” నేమ్ ప్లేట్ పై పోలీసులు స్వీట్ వార్నింగ్..
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో అయినా, పొలిటికల్ కెరియర్ లో అయినా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
ఏపీ ఎన్నికల తరుణంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం( Pithapuram ) నుంచి పోటీ చేస్తున్న సమయం, ప్రచార సమయంలో కూడా చాలామంది అతని విజయంపై ఆశక్తి చూపుతో తమ బైకులు , కార్లపై ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ పోస్టర్లు అతికించుకున్న ఫోటోలు మనం సోషల్ మీడియాలో చూశాం.
ఇక మరికొందరు అయితే ఏకంగా బైకు నెంబర్ ప్లేట్( Bike Number Plate ) స్థానంలో ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ రాసి ఉన్న నెంబర్ ప్లేట్లు పెట్టారంటే నమ్మండి.
ఇక మరోవైపు ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతోపాటు డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఇక ఈ ట్రెండ్ మరింత బాగా పాపులర్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా మరోవైపు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్ని నేమ్ ప్లేట్లు ఉంచడం ట్రాఫిక్ రూల్స్ కి( Traffic Rules ) విరుద్ధమని విమర్శలు కూడా అనేకంగా వచ్చాయి.
ఇక ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ .‘‘ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెడ్డ పేరు తీసుకురాకండి.
"""/" /
పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదని అడిగితే.
మాది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా( Pithapuram MLA Taluka ) అని చెప్పకండి.
నన్ను తిడతారు.అలాగే వన్ వేలో వెళుతూ.
అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని అంటే ఎలా?’’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.
ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని, అందరూ కచ్చితంగా చట్టాలను పాటించాలని చెప్పే స్థితిలో మనం ఉన్నప్పుడు చట్టాలు కూడా మనం పాటించకపోతే ఎలా.
అని సరదాగా చేయండి అప్పుడప్పుడూ.నాకు రెండకరాల స్థలం ఉంది కదా అక్కడికి వచ్చి బైక్‌లు వేసుకుని తిరగండి.
కావాలంటే అక్కడ ఒక బైక్ రేసు పెడదాం.దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, గార్డ్స్ ధరించి తిరగండి.
మీరు బాగుండాలనే కదా మా ప్రయత్నం’’ పవన్ కళ్యాణ్ అభిమానులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు.
"""/" /
ఇది ఇలా ఉండగా.తాజాగా మెయిన్ నెంబర్ ప్లేట్ కు బదులు ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ ఉన్న స్కూటీని ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ఆపేసి స్కూటీపై వెళ్తున్న ఇద్దరిని ఫ్రెండ్లీగా క్లాస్ తీసుకున్నారు.
అందరు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని, అలాగే స్కూటీ నెంబర్ ఏమిటా అని ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని అడగ వారు స్కూటీ డిక్కీ లో నుంచి అసలైన నెంబర్ ప్లేట్ తీసి చూపించారు.
అనంతరం కరెక్ట్ నెంబర్ ప్లేట్లను ట్రాఫిక్ పోలీస్ వారు ఫిట్ చేయించి మరి ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటూ చెప్పారు.
అలాగే ఆ పోస్టర్ వేయించుకోవడానికి బండి పై వేరే చోటు కూడా ఉంది కదా మీరు పర్ఫెక్ట్ నెంబర్ ప్లేట్ మైంటైన్ చేయాల్సిందే.
మీకు ఏదైనా అభిమానం ఉంటే బైక్పై నెంబర్ ప్లేట్ ప్లేస్ లో కాకుండా ఎక్కడైనా వేయించుకోండి మాకు అభ్యంతరం లేదు అంటూ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ ట్రాఫిక్ పోలీస్ లు చేసిన పనికి నెటిజన్స్ హర్షం వ్యక్తం చేసారు.
మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అంటున్న బిగ్ బాస్ షో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?