పాత ఆటోలతో కోట్లలో వ్యాపారం... మన హైదరాబాద్​లోనే!

అదేదో మంచి వ్యాపారం అనుకోకండి.భాగ్యనగరంలో తాజాగా ఇల్లీగల్ దందా బయటపడింది.

కొందరు రవాణా శాఖ అధికారులు, ఫైనాన్షియర్లు కలిసి ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు.

వాహన కాలుష్యం కారణంగా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను కొని వాటిని తుక్కుకింద మార్చి, వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతులు ఇచ్చేస్తున్నారు.

ఐడియా బాగా వర్కవుట్ అయిందని అనుకున్నారు కానీ పాపం ఊరికే పోదు కదా.

ఏదో రోజు బయటపడాల్సిందే.అవును, రవాణా శాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.

లక్షలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో ఆటోకు రూ.

3-4లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు.కాగా ఈ బాగోతం ఆటోడ్రైవర్ల యూనియన్లు వెలికి తీయడంతో రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో స్క్రాప్‌ ఆటోల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా సంబంధిత అధికారులు నిలిపేశారు.

సో కాల్డ్ కేటుగాళ్లు ఏం చేస్తున్నారంటే.15ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆటోడ్రైవర్ల అడ్రసులు సేకరించి తక్కువకు ఆటో కొని, రవాణాశాఖ అధికారులతో కుమ్మక్కై కొత్త ఆటోలను కొని ఫైనాన్స్‌ కింద ఇస్తున్నారు.

"""/"/ ఇలా రవాణాశాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు డిమాండ్ చేసి అనుమతులిస్తున్నారు.

మలక్‌పేట, టోలీచౌకి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాయాల్లో ఈ అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తేలింది.

ఈ యవ్వారంలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయట.

ఈ యవ్వారం ఎలా బయటపడిందంటే తుక్కు జాబితాలో ఉన్న ఆటోలు రోడ్లపై తిరుగుతుండడం, స్కూల్‌ విద్యార్థులను తీసుకెళ్తుండడంతో ఆటో డ్రైవర్ల యూనియన్ల సభ్యులకు అనుమానం వచ్చి కంప్లైంట్ చేశారట.

తేజ సజ్జా సినిమాలో గెస్ట్ రోల్ లో ప్రభాస్.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!