పిల్లల కోసం ట్రాకింగ్ షూస్.. ఇకపై వారెక్కడున్నా ఈజీగా కనిపెట్టేయచ్చు..
TeluguStop.com
సాధారణంగా చిన్నపిల్లలు చెప్పకుండా తమకు నచ్చినట్లు ఎక్కడికంటే ఎక్కడికెళ్ళిపోతుంటారు.వారు కాసేపు కనిపించకపోతే తల్లిదండ్రులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు.
ఇక స్కూల్ కి వెళ్ళినా పార్కుకి వెళ్లిన ఇంకేతర ప్రదేశాలకు వెళ్లి త్వరగా రాకపోయినా టెన్షన్ పెరిగిపోతుంటుంది.
ఇలాంటి టెన్షన్ అక్కర్లేకుండా తాజాగా ఒక సరికొత్త టెక్నాలజీతో కంపెనీలు షూస్ తీసుకొచ్చింది.
ఈ షూస్ పిల్లలకి తొడిగితే వారి కదలికలను ఈజీగా తెలుసుకోవచ్చు.వారి జాడ తెలుసుకొని వెంటనే వారి దగ్గరికి వెళ్లి వారిని ఇంటికి తీసుకురావచ్చు.
అదెలాగంటే, ఈ షూస్‌లో జీపీఎస్ స్మార్ట్‌సోల్ ట్రాకర్ ఆఫర్ చేస్తున్నారు.వీటికి స్మార్ట్ ట్రాక్ షూ అని పేరు పెట్టారు.
ఈ షూస్ అడుగు భాగంలో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది.తల్లిదండ్రులు ఆ ట్రాకర్‌ను తమ ఫోన్ ద్వారా అటాచ్ చేసుకుంటే ఆ షూ ఎక్కడ తిరుగుతోందనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
నిజానికి పిల్లలను ట్రాక్ చేయడానికి చిన్న బిళ్లల్లాంటి జీపీఎస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి.
వాటిని బ్యాగు, డ్రెస్సు లేదా పిల్లలు ధరించే ఇతర యాక్సెసరీలకి వీటిని అటాచ్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఇవి బయట కనిపిస్తాయి.ఒక్కోసారి పడిపోవచ్చు కూడా.
దీనివల్ల పిల్లలను కచ్చితంగా ట్రాక్ చేయడం అనేది 100% సాధ్యం కాకపోవచ్చు. """/"/
అదే స్మార్ట్ ట్రాక్ షూ అయితే బయటకు కనిపించకుండా అవి కింద పడిపోకుండా ట్రాకర్‌ను పిల్లల పాదాల కింద భద్రంగా ఉంచుతాయి.
ఈ ట్రాకర్లను విడిగా కూడా అమ్ముతారు.కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో స్మార్ట్‌సోల్ ట్రాకర్లు కోసం సెర్చ్ చేయొచ్చు.
ఇవి వివిధ సైజుల్లో కూడా దొరుకుతున్నాయి.వాటిని పిల్లల బూట్లలో పెట్టడం ద్వారా వారి లొకేషన్ తెలుసుకోవచ్చు.
సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?