జాడలేని భూసార పరీక్షలు…పెరుగుతున్న ఎరువుల వాడకం

మట్టి స్వభావం ఆధారంగా పంటలు సాగు చేయాలని, సల్ప పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించాలని,ఇందుకోసం భూసార పరీక్షలు కీలకమని భావించి ప్రభుత్వాలు వాటిని క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చాయి.

కానీ,భూసార పరీక్షలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నల్లగొండ జిల్లా(Nalgonda District) మర్రిగూడ మండల(Marriguda Mandal) పరిధిలోని వ్యవసాయ అధికారులకు సంబంధిత కిట్లను కూడా అందజేశారు.

కొంతకాలం ఈ పరీక్షలు నిర్వహించిన అధికారులు గత నాలుగేళ్లుగా జాడ లేకుండా పోయారని అంటున్నారు.

మండల వ్యాప్తంగా వానా కాలంలో 35 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయి.

గతంలో వేసవిలో సంబంధిత ఏఈవోల ద్వారా భూసార పరీక్షలను చేసేవారు.ఆ ఫలితాలకు అనుగుణంగా రైతులు పంటల సాగుకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

అయితే నాలుగేళ్లుగా ఆ ఊసే ఎత్తకపోవడంతో రైతులు తమకు తోచిన విధంగా ఎరువులను వినియోగిస్తున్నారని,ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని,గత ప్రభుత్వం ఏటా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో 10 ఎకరాలకు ఒక మట్టి నమూనా,వర్షధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒక మట్టి నమూనా సేకరించి పరీక్షలు చేసి నేల పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేవారని,నేలకి అనుగుణంగా రైతులు ఎరువులను వాడేవారని, అయితే నాలుగేళ్లుగా వ్యవసాయ శాఖ (Department Of Agriculture)భూసార పరీక్షలు కార్యచరణను రూపొందించడం లేదని, దీనితో అవగాహన లోపంతో అన్నదాతలు ఇష్టానుసారంగా ఎరువులు,పురుగు మందులు</em(Fertilizers ,pesticides) వాడడంతో రోజురోజుకు భూసారం పూర్తిగా తగ్గిపోయి నేల పంటలకు సహకరించే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి మట్టి సారాన్ని బట్టి పంటలు వేసేలా, దానికీ అనుగుణంగా ఎరువులు వాడేలా అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

ఒక సినిమా సక్సెస్ లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది…