ఆ ప్రాంతం పై రేవంత్ స్పెషల్ ఫోకస్ ! బీఆర్ఎస్ కు ఇబ్బందే ?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు ఎప్పటికప్పుడు అనేక వ్యూహాలు రచిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

( Revanth Reddy ) ముఖ్యంగా బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.

  దీనిలో భాగంగానే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో,  అక్కడ కాంగ్రెస్ ప్రభావాన్ని  పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  గతంతో పోలిస్తే బీఆర్ఎస్( BRS ) ప్రభావం ఉత్తర తెలంగాణలో తగ్గినట్టుగా కనిపిస్తుండడం , కెసిఆర్( KCR ) తమ పార్టీని టేఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం తో ఆ పార్టీ ప్రభావం బాగా తగ్గిందని , అక్కడ కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచగలిగితే వచ్చే ఎన్నికల్లో చాలావరకు సక్సెస్ అవ్వచ్చనే ఆలోచనతో రేవంత్ ఈ ప్రాంతం ప్రత్యేకంగా దృష్టి సారించారు.

"""/" / సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.నిజామాబాద్ జిల్లాలోని అనేక నియోజకవర్గాలపై ప్రభావం చూపించగల నేతగా పేరుపొందిన బీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వర్లు,( Mandava Venkateswarlu ) వరంగల్ జిల్లాకు చెందిన బిజెపి నేత రేవూరి ప్రకాష్ రెడ్డి( Revuri Prakash Reddy ) తదితరులతో రేవంత్ ఇప్పటికే సంప్రదింపులు చేపట్టారు.

వారు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో, త్వరలోనే వారిని చేర్చుకునే ప్లాన్ లో ఉన్నారు.

"""/" / ఇక మూడు రోజులపాటు బస్సుయాత్ర( Bus Yatra ) ఈ ప్రాంతంలో కొనసాగబోతుండడం, రాహుల్, ప్రియాంక గాంధీలు హాజరు కాబోతు ఉండడం తో భారీగా చేరికలు ఉంటాయని రేవంత్ అంచనా వేస్తున్నారు .

ఉత్తర తెలంగాణలో రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో గెలిచింది.దీంతో ఇక్కడ బాగా బలం పుంజుకుంటే అధికారానికి డోఖా ఉండదనే లెక్కలు రేవంత్ ఉన్నారు.

అందుకే బీఆర్ఎస్ లో బలమైన ప్రజాకర్షణ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే వ్యూహానికి తెర తీశారు.

నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.

రెండు రోజుల్లో జలుబు తగ్గాలంటే ఈ టీ తాగండి!