అంగీలు చింపుకుంటున్నారు అయ్యా కొడుకులు ! రేవంత్ ఫైర్ 

తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలకు మంత్రి కేటీఆర్( Minister KTR ) వ్యంగంగా చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ కు అధికారం ఇస్తే జరిగేది ఇదేనంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ పై రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.''తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలను చూసి అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్న అయ్యా కొడుకులకు .

రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దొఖా ఇచ్చిన దగాకోరు ను గద్దె దించడం గ్యారెంటీ ! """/" / మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన భూ బకాసురులను బొంద పెట్టడం గ్యారెంటీ.

! కాపలా కుక్కలాగా ఉంటానని, ఖజానాను కొల్లగొడుతున్న దొంగల ముఠాను తరిమి కొట్టడం గ్యారంటీ.

! కమిషన్లను దండుకోవడమే మిషన్ లాగా పెట్టుకున్న వసూల్ రాజాల భరతం పట్టడం గ్యారెంటీ ! పదేండ్లలో 100 ఏండ్ల విధ్వంసం సృష్టించిన వినాశకారులను పాతరేయడం గ్యారెంటీ ! తెలంగాణ ఆత్మగౌరవాన్ని బిజెపికి( BJP ) తాకట్టు పెట్టిన గులాబీ గ్యాంగ్ ను పాతాళానికి తొక్కడం గ్యారెంటీ .

! నాలుగు కోట్ల ప్రజల కళ్ళుగప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల ముసుగులను ఊడదీసి ప్రజాక్షేత్రంలో ఊరికించడం గ్యారంటీ .

! """/" / అధికారం శాశ్వతం అనుకుని నిలిచిన నిజాం రాచరికాన్ని పీచమనిచిన గడ్డ ఇది.

మీరొక లెక్కా .? అధికారంలోకి వస్తున్నాం.

అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం .' అంటూ కేటీఆర్ కు ఘాటుగా రేవంత్ రిప్లై ఇచ్చారు.

రెండు రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సిడబ్ల్యూసి సమావేశాల( CWC Meeting ) నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన తీర్మానాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన తదితర అంశాలపై టిఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఈ విధంగానే రేవంత్ కౌంటర్లు ఇస్తున్నారు.

ద్యావుడా.. చైనా మహిళలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే..