ఓఆర్ఆర్ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్

హైదరాబాద్ ఓఆర్ఆర్ వివాదంపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

కేటీఆర్ సమాధానం చెప్పలేకనే అధికారులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు.ఓఆర్ఆర్ పై అర్వింద్ కుమార్ వివరణ సంతృప్తిగా లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రముఖ సంస్థ నివేదిక ఆధారంగా టెండర్ పిలిచామని చెప్పారన్న ఆయన ఓఆర్ఆర్ పై నివేదిక ఇచ్చిన సంస్థ చరిత్ర సక్రమంగా లేదని వెల్లడించారు.

ఓఆర్ఆర్ పై అప్పుల భారం లేదన్నారు.బేస్ ప్రైస్ నిర్ణయించకుండా ఎవరైనా టెండర్లు పిలుస్తారా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం టోల్ గేట్స్ పై ఏడాదికి రూ.730 కోట్ల ఆదాయం అని తెలిపారు.

2031 తరువాత హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ మారుతుందని వెల్లడించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్న కేసీఆర్ ఓఆర్ఆర్ ను ప్రైవేట్ కు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности