కాంగ్రెస్ పొత్తులు.. రేవంత్ రెడ్డి ఎత్తులు !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా అంతర్మదనాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఆ పార్టీని వర్గ విభేదాలు, ఆదిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు.

ఇలా చాలా సమస్యలే వెంటాడుతున్నాయి.దాంతో పార్టీ గతంతో పోలిస్తే కొంత బలహీన పడిందనే చెప్పక తప్పదు.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసిఐ పదవి చేపట్టిన తరువాత అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్క.ఇలా చాలమంది సీనియర్ నేతలు రేవంత్ కు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు.

ఈ విభేదాల కారణంగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడు వంటి నియోజిక వర్గాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది.

"""/" / దాంతో ఇదిలాగే కొనసాగితే కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన ఆశ్చర్యం లేదనే వాదన కూడా వినిపించింది.

ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు వినిపించారు.

అయితే అధిష్టానం అలాంటి ఆలోచన చేయకపోవడంతో సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు.ప్రస్తుతం అధిష్టానం సూచనల మేరకు పార్టీ బలోపేతం కోసం వ్యతిరేకత చూపిన సీనియర్సే రేవంత్ తో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ' హత్ సే హత్ జోడో యాత్ర అంటూ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోందని కాంగ్రెస్ చెబుతోంది.

"""/" / ఇదిలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నా నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి ఈ పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు.

తెలంగాణలో వామపక్షాలతో పొత్తులపై అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు.

గత ఎన్నికల సమయంలో ఏపీలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పొత్తుకున్న విషయం తెలిసిందే.

దాంతో అదే పొత్తు తెలంగాణలో కొనసాగుతుందా అంటే అలాంటి ప్రసక్తే లేదని ప్రస్తుతం టీడీపీ బీజేపీ పొత్తుకోసం చూస్తోందని, అందువల్ల తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోటీ చేయడం సాధ్యం కాదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగానే ఉన్నప్పటికి బి‌ఆర్‌ఎస్ ను గద్దె దించే శక్తి కాంగ్రెస్ కు లేదనేది అందరికీ తెలిసిన విషయమే.

మరి కే‌సి‌ఆర్ ను గద్దె దించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని చెబుతున్న రేవంత్ రెడ్డి.

అందుకోసం ఎలాంటి వ్యూహాలు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న హీరోలు వీళ్లే.. ఈ హీరోలకు సక్సెస్ దక్కుతుందా?