ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ SUV కార్లు ఇవే

మీరు కూడా SUV కారును కొనాలని అనుకుంటున్నారా? అయితే మంచి ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ కారును కొనాలని ప్లాన్ వేసుకుంటున్నారా? దేశంలోనే భారీగా అమ్ముడుపోతున్న టాప్ 5 SUV కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్యూవీ విభాగంలో టాటా నెక్సన్ గత నెలలో ఎక్కువగా అమ్ముడుపోయింది.నవంబర్‌లో 15,871 యూనిట్లు అమ్ముడుపోవడం విశేషం.

దీంతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న SUV జాబితాలో ఇది అగ్రస్థానంలో నిలిచింది.గతేడాదిలో అయితే ఇదే సమయంలో ఈ కార్ల విక్రయాలు దాదాపు 60 శాతం పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఇకపోతే హ్యుందాయ్ కంపెనీలోని ఫ్లాగ్ షిప్ క్రెటా కూడా ఎస్యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా నిలిచింది.

నవంబర్ లో 13,321 మంది వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేశారు.గతేడాది కాలంలో దీని కొనుగోలు 58 శాతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే టాటా మోటార్స్ గత నెలలో 12,131 యూనిట్లు అమ్ముడుపోయింది.దీంతో ఎస్యూవీ జాబితాలో ఈ కారు మూడో అతి పెద్ద అమ్ముడైన కారుగా అవతరించింది.

"""/"/ ఇకపోతే అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎస్యూవీ జాబితాలో బ్రెజ్జా సబ్-కాంపాక్ట్ కారు కూడా నిలిచింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చింది.అయితే ప్రస్తుతం అమ్మకాల పరంగా చూస్తే ఇది నాలుగో స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి కూడా 11,324 యూనిట్ల బ్రెజ్జాను అమ్మకం చేపట్టింది.హ్యుందాయ్ విషయానికి వస్తే నవంబర్ నెలలో వెన్యూ ఎస్యూవీ ద్వారా 10,738 యూనిట్ల అమ్మకాలు చేపట్టింది.

ఇది బ్రెజ్జా కంటే కొంచెం తక్కువే అయినా వెన్యూ, బ్రెజ్జా కోసం చాలా మంది ఎదురుచూశారు.

ఈ కార్ల కోసం వినియోగదారులు పోటీ పడ్డారు.మార్కెట్ లో తక్కువ అమ్ముడుపోతున్నప్పటికీ ఈ కార్లకు డిమాండ్ మాత్రం భారీగానే ఉంది.

క సినిమా హిట్ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న కిరణ్…నిజంగా గ్రేట్ అంటూ?