రాధేశ్యామ్ కోసం వాయిస్ అందించిన స్టార్స్ వీరే.. అఫిషియల్ అనౌన్స్..
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతుంది.తమ అభిమాన హీరోను వెండి తెర మీద చూసి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.
అందుకే రాధేశ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈసారి మాత్రం మిస్ అయ్యే సమస్యే లేదు.
దీంతో అందుకు పనులు కూడా చకచకా చేసేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇప్పుడు ఆ అంచనాలను డబుల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ లను రంగంలోకి దింపి మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు.
ఇక తాజాగా మిగతా భాషల్లో కూడా ఎవరు వాయిస్ అందిస్తున్నారో మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేసి అందుకు వారికీ థాంక్స్ కూడా చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.
మన తెలుగులో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఎస్ ఎస్ రాజమౌళి అందిస్తున్నాడు.
"""/"/
అలాగే కన్నడలో శివ రాజ్ కుమార్, మలయాళంలో పృద్వి రాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.
తమ సినిమాకు గాత్రం అందిస్తున్నందుకు థాంక్స్ చెబుతూ వారు పోస్టర్స్ రిలీజ్ చేసారు.
ఇక మిగిలింది తమిళ్ వెర్షన్ మాత్రమే.ఆ భాషలో ఎవరు గాత్రం అందిస్తారో ఇంకా ప్రకటించలేదు.
ఈ సినిమా రిలీజ్ కు కొద్దీ రోజులే ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.
మరి ఇన్నాళ్ళుగా ఊరిస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.
నాగార్జున అసలు పేరు అది కాదా…. అసలు పేరు ఏంటో తెలుసా… ఇన్నాళ్లు తెలియనే లేదే?