తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్.. రాష్ట్రానికి రానున్న అమిత్ షా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఈ మేరకు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు.పార్టీని బలోపేతం చేస్తూ గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మళ్లీ రాష్ట్రానికి రానున్నారు.

పర్యటన నిమిత్తం ఈ నెలలో రెండుసార్లు ఆయన పర్యటించనున్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగా ఈనెల 10 వ తేదీన ఆదిలాబాద్ జిల్లాకు రానున్న అమిత్ షా 27వ తేదీన గద్వాల్ కు రానున్నారు.

అదేవిధంగా ఈనెల 20, 21న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారని తెలుస్తోంది.

గిరిజనుల ఓట్లు టార్గెట్ గా ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈనెల 14 తరువాత బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల వడపోతపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది.

పోటీ తక్కువ ఉన్న నియోజకవర్గాల జాబితాను బీజేపీ మొదటగా ప్రకటించనుంది.

దుబాయ్: 5-స్టార్ రిసార్ట్ బాల్కనీలో బట్టలు ఎండేసిన ఇండియన్ మహిళ.. చివరికి?