పెళ్లంటే చాలు.. నో ఇంట్రెస్ట్ అనేస్తున్న ముద్దుగుమ్మలు వీరే!
TeluguStop.com
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు.
కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే బ్యూటీలు మాత్రం పెళ్లి అంటేనే నో అంటున్నారు.
మరి ఆ సీనియర్ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.అనుష్క శెట్టి, త్రిష, శృతి హాసన్, నిత్యా మీనన్, ఛార్మీ లాంటి ముద్దుగుమ్మలు 30 దాటి చాలా ఏళ్ళు అవుతున్న ఇంకా పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపించడం లేదు.
పెళ్లి అంటేనే నో ఇంట్రెస్ట్ అనేస్తున్నారు.కానీ వీరి ఫ్యాన్స్ మాత్రం వీరు ఎప్పుడు శుభవార్త చెబుతారా అని ఎదురు చూస్తున్నారు.
వీరిలో ఛార్మీ మినహా మిగతా వారంతా కెరీర్ లో బిజీగానే ఉన్నారు. """/"/
ఇక ఈ మధ్య కాలంలో త్రిష పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియా నుండి టాలీవుడ్ మీడియా వరకు వరుస కథనాలు వచ్చాయి.
ఈమె ఇప్పటికే ఒక బిజినెస్ పర్సన్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది.
ఆ తర్వాత మళ్ళీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఆ తర్వాత ఈమెను ఎన్నిసార్లు పెళ్లి గురించి మీడియా అడిగిన తనను అర్ధం చేసుకునే వారు దొరికితేనే కమిట్ అవుతాను అంటూ చెప్పుకొస్తూ దాటేస్తుంది.
ఇప్పటికి ఈమె పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు. """/"/
ఇక అనుష్క శెట్టి ప్రెజెంట్ సినిమాలు కమిట్ అవ్వకుండా కుటుంబంతో స్పెండ్ చేస్తుంది.
అవకాశాలు వచ్చిన నో అని చెప్పేస్తుంది.ఇక ఈ బ్యూటీని పెళ్లి గురించి అడిగితే ఏం మాట్లాడడం లేదు.
మీడియా పెళ్లి చేసుకోవడం లేదు అని ఒత్తిడి తెచ్చినా ఈమె మాత్రం పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపడం లేదు.
ఇక నిత్యా మీనన్ కూడా వివాహం విషయంలో ఇలాగె ఆలోచిస్తుంది.పెళ్లి కంటే కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్న తర్వాతనే వివాహం వరకు వెళ్లాలని అప్పుడే ఫ్యూచర్ బాగుంటుంది అని అంటుంది.
ఇక శృతి ఇప్పుడు పెళ్లి వదిలేసి కెరీర్ మీద ఫోకస్ చేసింది.అలాగే చార్మీ కూడా పెళ్లి ఊసు ఎత్తడం లేదు.
హ్యాట్రిక్‌తోపాటు 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన సుమన్ కుమార్