ఈ సీజన్‌లో ఖర్బూజ పండును తినాలి....ఎందుకో తెలిస్తే మానకుండా తింటారు
TeluguStop.com
వేసవి కాలం మొదలైందంటే ఖర్బూజ పండ్లు బాగా విరివిగా దొరుకుతాయి.ఇవి రుచిలో చప్పగా ఉన్నా వేసవి తాపం తగ్గటానికి ఖర్భుజ పండ్ల ముక్కలపై పంచదార, ఉప్పు, కారం వంటివి జల్లుకొని తింటారు.
కొంత మంది జ్యుస్ చేసుకొని త్రాగుతారు.ఖర్బూజను ఏ రూపంలో తీసుకున్న సరే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఈ వేసవి సీజన్ లో ప్రతి రోజు ఒక కప్పు ఖర్బూజ పండ్ల ముక్కలను తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.
ఖర్బూజ పండులో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగుండేలా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గి వ్యాధులు రాకుండా ఉంటాయి.ఖర్బూజ పండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
దాంతో హై బీపీ తగ్గుతుంది.గుండె సమస్యలు ఉన్నవారికి ఈ పండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.
ఖర్బూజ పండు జ్యుస్ త్రాగటం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.
"""/"/
ఈ పండ్లలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.
బిడ్డ ఎదుగుదులకు తోడ్పడుతుంది.ఖర్బూజ పండులో దాదాపు 92 శాతం నీరుంటుంది.
దీంతో వేసవిలో మనకు కలిగే అధిక దాహం సమస్యను ఈ పండు తీరుస్తుంది.
కిడ్నీలో రాళ్లను కరిగించే గుణాలు ఉన్నాయని ఆయుర్వేదంలో చెప్పుతుంది.ఖర్బూజ పండ్లను రోజూ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలు తొలగిపోయి మలబద్దకం సమస్య దూరమవుతుంది.
ఏఆర్ రెహమాన్ విడాకులకు అసలు కారణం ఆమేనా.. విడాకుల వెనుక ట్విస్ట్ ఇదేనా?