వన్డే వరల్డ్ కప్ టోర్నీ లీగ్ దశలో టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు వీళ్లే..!
TeluguStop.com
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ మ్యాచ్లు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ లీగ్ దశలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు ఎవరో చూద్దాం.
ఈ టోర్నీ లీగ్ దశలో ఆడిన మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ( Virat Kohli ) అగ్రస్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ ఆడిన 9 మ్యాచ్ లలో రెండు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలతో 594 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డికాక్( DeCock ) 591 పరుగులతో రెండవ స్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్ ప్లేయర్ రవీంద్ర( Rachin Ravindra ) 565 పరుగులతో మూడవ స్థానంలో నిలిచాడు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) 503 పరుగులతో నాలుగవ స్థానంలో నిలిచాడు.
"""/" /
ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్( David Warner ) 499 పరుగులతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.
ఈ టోర్నీ లీగ్ మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల విషయానికి వస్తే.
సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డికాక్ నాలుగు సెంచరీలతో మొదటి స్థానంలో నిలిచాడు.రచిన్ రవీంద్ర మూడు సెంచరీలు చేయగా.
విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్ వెల్ తలో రెండు సెంచరీలు చేశారు.
ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికి వస్తే.
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా( Adam Zampa ) 22 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు.
"""/" /
ఈ జాబితాలో మధుశంక( Madhushanka ) 21 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
షాహిన్ అఫ్రిది( Shaheen Afridi ) 18 వికెట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.
గెరాల్డ్ కోయెట్జీ( Gerald Coetzee ) 18 వికెట్లతో నాలుగవ స్థానంలో నిలిచాడు.
జస్ప్రిత్ బుమ్రా( Jasprit Bumrah ) 17 వికెట్లతో 5వ స్థానంలో నిలిచాడు.
ఆ తర్వాతి స్థానాలలో రవీంద్ర జడేజా( Jadeja ) 16 వికెట్లు, మహమ్మద్ షమీ( Shami ) 16 వికెట్లతో మిగతా స్థానాల్లో ఉన్నారు.
ఈ టోర్నీలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు పూర్తయితే ఈ జాబితాలలో ఆటగాళ్ల పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉంది.
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ