భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న కెనడా పోలీసులు
TeluguStop.com
నిజ్జర్ హత్య కేసుపై కెనడా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఇండో కెనడియన్ సంబంధాలు దిగజారిపోతున్నాయి.
ఈ కేసులో ఏకంగా కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) పేరును అనుమానితుల జాబితాలో చేర్చడం వివాదాస్పదమైంది.
ట్రూడో చర్యల కారణంగా ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కెనడా చర్యలతో భగ్గుమన్న భారత్.ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్ సహా దౌత్య సిబ్బందిని బహిష్కరించింది.
అయితే తాను చేసిన వ్యాఖ్యలపై నిలబడాల్సిన ట్రూడో పూర్తిగా చేతులెత్తేశారు.నిజ్జర్ హత్యపై నిఘా వర్గాల సమాచారమే తప్పించి, బలమైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించి విమర్శల పాలవుతున్నారు.
"""/" /
అటు కెనడా పోలీసులు( Canadian Cop ) సైతం కెనడాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల వెనుక భారత ప్రమేయం ఉన్నట్లుగా ఆధారాలు ఉంటే తమను సంప్రదించాలని సిక్కులకు విజ్ఞప్తి చేయడం దుమారం రేపింది.
భారత్‌లోని కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్( Bishnoi Gang )తో సహా కెనడాలోని క్రిమినల్ గ్యాంగ్‌లతో భారతీయ దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులకు సంబంధాలు ఉన్నాయని ఆర్‌సీఎంపీ ఆరోపించింది.
వీరు కెనడాలో హత్యలు, దోపిడీలు సహా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని దుయ్యబట్టింది.ఈ ఘటనలకు సంబంధించి 8 మందిపై హత్య, 22 మందిపై దోపిడీ ఆరోపణలు చేసింది ఆర్‌సీఎంపీ """/" /
తాజాగా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్( Royal Canadian Mounted Police ) (ఆర్‌సీఎంపీ) ఉన్నత అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వం తరపున కెనడాలో పనిచేస్తున్న నేరస్తుల నెట్‌వర్క్ నుంచి దేశ ప్రజలకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదన్నారు ఆర్‌సీఎం అసిస్టెంట్ కమీషనర్ గౌవిన్ .
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు.భారతీయ మీడియా ఈ అంశంపై తప్పుడు కథనాలు నివేదిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అయితే ఇప్పటి వరకు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లుగా ఆర్‌సీఎంపీ ఎలాంటి ఆధారాలు బహిరంగంగా చూపించలేకపోయింది.
సమాచారం సేకరిస్తూనే ఉన్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ దళాలు చెబుతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?