2023 అయినా బాలీవుడ్ కు కలిసి వస్తుందా?

ఇటీవల కాలంలో సౌత్ కంటే బాలీవుడ్ పరిశ్రమ బాగా వెనుకబడి పోయింది.మన సౌత్ నుండి పాన్ ఇండియా సినిమాలతో వరుస రిలీజ్ లు అవ్వడమే కాకుండా ఆ సినిమాలు చాలా వరకు ఆకట్టు కోవడం భారీ కలెక్షన్స్ రాబట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

అయితే అదే సమయంలో బాలీవుడ్ కు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు.

వచ్చిన ప్రతీ సినిమాను ప్లాప్ చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు.దీంతో 2022 ఏడాది వీరికి అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి.

ఈ ఏడాదిలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ బడ్జెట్ సినిమాలన్నీ భారీగా బోల్తా కొట్టాయి.

స్టార్ హీరోల కెరీర్ లో ఎన్నడూ రానటువంటి ఓపెనింగ్స్ రావడంతో వారు విస్తు పోయారు అనే చెప్పాలి.

మరి 2022 లో అతి దారుణంగా అట్టర్ ప్లాప్ అయిన సినిమాలపై ఒక లుక్ వేద్దాం.

హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య వచ్చిన అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యింది.

ఇంకా రణవీర్ సింగ్ హీరోగా నటించిన జయేశ్బాయ్ జోర్దార్ కూడా బోల్తా కొట్టింది.

బడ్జెట్ సహా కంటెంట్ భారీ లెవల్ లో హైప్ సాధించగా రిలీజ్ తర్వాత అంచనాలు అందుకోలేక పోయింది.

"""/"/ అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్, సామ్రాట్ పృథ్వీ రాజ్ కూడా రిలీజ్ కు ముందు పెద్ద సంచలనం అయ్యింది.

కానీ రిలీజ్ తర్వాత విఫలం అయ్యింది.కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది.

కత్రినా కైఫ్ నటించిన హారర్, కామెడీ మూవీ ఫోన్ భూత్ ని ప్రేక్షకులు తిరస్కరించారు.

భారీగానే ఖర్చు చేసిన ఈ సినిమా బొక్కబోర్లా పడడంతో భారీ నష్టాలు చవిచూశాయి.

"""/"/ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు.

ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లెక్కలు మార్చేస్తుంది అని కథనాలు వచ్చాయి.

కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి ప్లాప్ అయ్యింది.

ఈయన కూడా బాలీవుడ్ ను ఆదుకోలేక పోయాడు.ఇక బ్రహ్మాస్త్ర ఓపెనింగ్స్ అయితే బాగా రాబట్టింది.

దీంతో ఈ సినిమా అయినా బాలీవుడ్ కు ఊపిరి పోస్తుంది అనుకుంటే తుస్ మనిపించింది.

మరి 2023 అయినా బాలీవుడ్ కు కలిసి వస్తుందో లేదో చూడాలి.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?