వింట‌ర్‌లో ఈ ఫుడ్ తింటే.. జ‌లుబు రానే రా‌ద‌ట‌?

ప్ర‌స్తుతం వింట‌జ‌ర్ సీజ‌న్ కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో ఉద‌యం పూట బ‌య‌ట మంచు ప‌డుతుంటే.

లోప‌ల దుప్ప‌టి క‌ప్పుకుని వేడి వేడిగా ఒక క‌ప్పు ఛాయ్ తాగితే ఆహా.

అదిరిపోతుంది అని అనుకునే వారు ఎంద‌రో.అయితే ఈ సీజ‌న్‌లో చ‌లి పెర‌గ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి త‌గ్గిపోతోంది.

దాంతో అనేక జ‌బ్బులు చుట్టు ముట్టేందుకు రెడీ అయిపోతాయి.అందులో జ‌లుబు ముందుంటుంది.

ఒక ఈ వింట‌ర్ సీజ‌న్‌లో జ‌లుబు చేసిందంటే.ఓ ప‌ట్టాన వ‌ద‌లు.

అందుకే వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే.ర‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిదంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముల్లంగి.

వింట‌ర్‌లో విరి విరిగా ల‌భిస్తుంది.ముల్లింగిలో ఉంటే పొటాషియం, ఐరన్ వంటి మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు.

కోల్డ్, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి.అలాగే చిలగడదుంప కూడా వింట‌ర్ సీజ‌న్‌లో ఖ‌చ్చితంగా తినాలి.

ఎందుకంటే.ఎన్నో పోష‌క విలువ‌లు నిండే ఉండే చిల‌గ‌డ‌దుంపులు డైట్‌లో చేర్చుకుంటే.

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరిగి జ‌లుబు స‌మ‌స్య‌ను ద‌రిచేర‌కుండా ర‌క్షిస్తుంది. """/"/ ఇక మీ రెగ్యుల‌ర్ డైట్‌లో త‌ప్ప‌కుండా పసుపును చేర్చుకోవాలి.

గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లిపి తీసుకోవ‌డం లేదా నీటి మ‌రిగించ‌డం చేస్తే.జ‌లుబుకు దూరంగా ఉండొచ్చు.

అలాగే వింట‌ర్‌లో అల్లాన్ని కూడా ప్ర‌తి రోజు తీసుకోవాలి.ఎందుకంటే, అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల‌క్ష‌ణాలు వైరస్, బ్యాక్టీరియాని తరిమి కొట్టి జ‌లుబు మ‌రియు ఇత‌ర శీతా కాల స‌మ‌స్య‌ల‌ను రాకుండా కాపాడుతుంది.

అదేవిధంగా, న‌ట్స్(ముఖ్యంగా బాదం, వాల్‌ నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు) డైల్ డైట్‌లో చేర్చుకోవాలి.

ఇవి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డంతో.సీజ‌న్‌ల‌గా వ‌చ్చే జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక వీటితో పాటు సిట్రస్ ఫ్రూట్స్‌, ఆకుకూర‌లు, నువ్వులు, బఠానీలు వంటివి కూడా వింట‌ర్‌లో త‌ప్ప‌కుండా తీసుకుంటే.

జ‌లుబుతో పాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లకు దూరంగా ఉండొచ్చు.

షాకింగ్ వీడియో: ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..