రేపు పోస్టల్ బ్యాలెట్ కు చివరి రోజు:జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్ వెంకట్రావు( Collector S Venkatarao ) ఆదనపు కలేక్టర్ సిహెచ్.

ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ మాట్లాడుతూ తేదీ:22-5-2024 నుండి తేది 23:5:2024 వరకు రెండు రోజులలో 182 మంది పోలింగ్ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, తేదీ:24-5-2024 చివరి రోజు కాబట్టి ఉదయం:8:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కలెక్టరేట్ లోని ఓటర్ పేసిలిటేషన్ సెంటర్( Voter Facilitation Centre ) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

హలో లేడీస్.. ఈ పోషకాలు తీసుకుంటున్నారా..?