రేపు పల్స్ పోలియో
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రతిసారి రెండు చుక్కలు,పోలియోపై నిరంతరంగా విజయం సాధిస్తుందని,అందుకే దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
ఆదివారం ఉదయం 7-00 గంటల నుండి అన్ని ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.
ఐదు సంవత్సరాల లోపు పిల్లల తల్లిదండ్రులు, తప్పనిసరిగా మీ దగ్గరలోని పోలియో కేంద్రాలలో మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
మార్చి 4,5 తేదీలలో పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తామన్నారు.
పోలియో చుక్కలు వేయించడం ద్వారా పిల్లలు పోలియో వ్యాధికి గురికాకుండా నివారించవచ్చని అన్నారు.
కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..