రేపు భద్రాచలంలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం..: భట్టి

తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ప్రతి లబ్దిదారుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

రాష్ట్రంలో అర్హులు అందరినీ గుర్తించి లబ్ధి చేకూరుస్తామని చెప్పారు.రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు.

ఎల్లుండి హైదరాబాద్ లో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్న భట్టి ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల నిధులు ఇస్తామని వెల్లడించారు.

వీడియో: అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన చిరుత.. కోడిని ఎలా పట్టేసిందో చూస్తే..