రేపు తెలంగాణలో జరిగే సీఎం సభకు.. సాగర్ ఉప ఎన్నికకు సంబంధం ఉందా.. ??

తెలంగాణ నల్లగొండ జిల్లా అనుముల మండలం అలీనగర్‌ సమీపంలో బుధవారం నిర్వహించనున్న కేసీయార్ సభకు అన్నీ ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా జిల్లాలో కొత్తగా 1,04,600 ఎకరాల టేలాండ్‌ భూముల సాగునీరు పధకానికి రేపు అనగా బుధవారం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.అయితే త్వరలో సాగర్ లో జరగనున్న ఉప ఎన్నికకు ముందు కేసీయార్ ఇలా బహిరంగ సభ పెట్టడంతో కొందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయట.

కొంపదీసి సాగర్ ఉప ఎన్నిక అంశాన్ని ఈ సభలో ప్రసంగిస్తూ ప్రజలను మభ్యపెడుతారు కావచ్చని గుసగుసలు కూడా మొదలైయ్యాయట.

అదీగాక ఈరోజు షర్మిల కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగబోయే సభలో సీఎం కేసీఆర్ ఈ అంశం పై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి, కాళేశ్వరం ద్వారా మొదట ఫలితం పొందింది ఉమ్మడి నల్గొండ జిల్లానేనని, అందుకే సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పేందుకే హాలియాలో సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అంతేగానీ ఈ సభకు సాగర్ ఉప ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదని క్లారీటి ఇచ్చారు.

41 వేల సంవత్సరాల నాటి జోంబీ వైరస్‌లు వెలుగులోకి.. ఎక్కడో తెలిస్తే..?