కళ్ల చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ (నల్లటి వలయాలు) సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.నిద్రలేమి, ఒత్తిడి, ఎక్కువగా ఫోన్ చూడటం, పోషకాహారం లోపం ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
దీంతో ఏవేవో క్రీములు ఉపయోగిస్తూ.వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే నిజానికి ఇంట్లో ఉండే టమాటాతోనే డార్క్ సర్కిల్స్‌కు సులువుగా చెక్ పెట్టవచ్చు.
మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బాగా పండిన టమాటా తీసుకుని పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా కలబంద గుజ్జు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.