రేపే వైకుంఠ ఏకాదశి... విష్ణుమూర్తిని ఇలా పూజించి.. ఆవుకు ఇది తినిపిస్తే చాలు.. అంతా శుభమే!

హిందువులు ఏకాదశిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు.ఈ క్రమంలోనే ప్రతినెల ఏకాదశి వచ్చే సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ ఏకాదశులలో వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.పుష్యమాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ ఏకాదశి రోజు నారాయణుడిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భావిస్తారు.అందుకే ఈ ఏకాదశి రోజు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి.

ఈ వైకుంఠ ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో నారాయణుడిని పూజించడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు.

ఈ క్రమంలోనే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి గంగా జలంతో స్నానం చేసి శ్రీహరి ఫోటోకి సన్నజాజి పూలతో అలంకరించి పూజించాలి.

అనంతరం స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన తులసి మాలను కూడా సమర్పించి పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

ఇలా స్వామి వారి పూజ అనంతరం ఓం నారాయణ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ స్వామి వారి కథను వినాలి.

"""/" / ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ఉపవాసంతో స్వామి వారిని పూజించడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజు సకల దేవతల ఆశీర్వాదాలు మన పై ఉండాలంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోమాతకు ప్రత్యేకంగా పూజలు చేయాలి.

గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆవుకు శుభ్రంగా స్నానం చేయించి బొట్లు పెట్టి పూజ చేసిన అనంతరం ఆవుకి పచ్చ గడ్డి వేస్తే సకల దేవతల ఆశీర్వాదాలు మనపై కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయి.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై భారీ రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ