రామోజీరావు మృతికి టాలీవుడ్ నివాళి.. షూటింగ్లకు సెలవు.!
TeluguStop.com
తెలుగు పత్రికా రంగంలో పేరుగాంచిన రామోజీరావు మృతికి టాలీవుడ్( Tollywood ) నివాళి అర్పించింది.
ఈ మేరకు రేపు షూటింగ్ లకు ఫిల్మ్ ఛాంబర్ సెలవు ప్రకటించింది.రామోజీరావు మృతికి సంతాపంగా రేపు షూటింగ్ లకు సెలవని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్( Film Chamber Secretary Damodar Prasad
) తెలిపారు.
రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వెల్లడించారు.ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, కేసీఆర్, పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం.. ఏడాది తర్వాత నిందితురాలి అరెస్ట్