కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలోకి పటాస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అపజయం ఎరుగని దర్శకుడిగా వరుస సినిమాలను తెరకెక్కిస్తూ వరుస విజయాలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను తనదైన శైలిలో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా అనిల్ రావిపూడి ఇకపై వెండితెరపై మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
తెలుగు ఓటీటీగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఆహా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆహా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓటీటీలో కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆహా అధికారకంగా వెల్లడించింది. """/"/
ఈ క్రమంలోనే ఆహా స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ అనిల్ రావిపూడిని కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి చైర్మన్ గా నియమిస్తూ, కామెడీకి కేరాఫ్ అడ్రెస్ ఐ పేర్కొంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.ఇక ఈయన జడ్జిగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్, ముక్కు అవినాష్, వేణు, హరి, బుల్లెట్ భాస్కర్, సద్దాం,యాదమ్మ రాజు వంటి పలువురు కమెడియన్లు ఈ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే తాజాగా F3 సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నటువంటి ఈయన బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు.
బేబీ జీసస్ దొంగలించాడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!