మహిళా బిల్లు ఘనత ఎవరి ఖాతాలో?
TeluguStop.com
గత రెండు దశాబ్దాలుగా మహిళలోకం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ఎట్టకేలకు సాక్షాత్కారమైంది.
ఇక ఉభయసభల్లో ఆమోదం పొంది చట్ట రూపంగా మారడం లాంచనమే అని చెబుతున్నారు.
మహిళా బిల్లుకు( Womens Reservation Bill ) కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం తో మహిళా ప్రాతినిధ్యం అత్యున్నత చట్టసభల్లో ఇక దర్జాగా కొలువు తీరుతుంది.
ఇంత కీలకమైన బిల్లు కార్యరూపం దాల్చడంతో ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలో అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఇది మా ఘనత అంటే మా ఘనత అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి.
కాంగ్రెస్ వాదన ఏమిటంటే 2010లోనే రాజ్యసభ లో ఈ బిల్లును ఆమోదింప చేశామని, అప్పటి యూపీఏ కూటమిలోని కొన్ని పార్టీలు దీనికిమద్దత్తు తెలపకపోవడంతో ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదని అయితే 2014 నుంచి పూర్తి మెజారిటీ తో గద్దెనెక్కిన భాజపా ప్రభుత్వం మాత్రం ఈ బిల్లుపై మీనమేషాలు లెక్కపెట్టిందని నిజంగా భారతీయ జనతా పార్టీకి ఈ మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే 2014లోనే దీనిని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేదని కాంగ్రెస్ వాదిస్తుంది.
"""/" / అయితే బిజెపి కూడా దానికి దీటైన వాదనతోనే ముందుకు వస్తుంది వాజ్పేయి హయాంలో కూడా రెండు సార్లు బిల్లును ఉభయసభల ముందుకు తీసుకు వచ్చామని అప్పుడు యూపీఏ కూటమి పార్టీలు మద్దతు ఇవ్వలేదని, ఆర్జెడి, సమాజ్వాది లాంటి పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే ఈ బిల్లు చట్ట రూపం దాల్చలేదని కమలనాధులు చెబుతున్నారు .
అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు మహిళా బిల్లు కార్యారూపం దాల్చింది అంటే అది భాజపా పుణ్యమే అని చెప్పక తప్పదు.
మహిళా బిల్లును తీసుకొచ్చిన ప్రధానిగా చరిత్రలో నరేంద్ర మోడీ( Narendra Modi ) మిగిలిపోతారని చెప్పవచ్చు.
"""/" / తాను గద్దెనెక్కినప్పటినుంచి ఆర్టికల్ 370 రద్దు , జిఎస్టి ఏర్పాటు( GST ) వంటి కీలకమైన బిల్లులను పట్టు పట్టి ఆమోదింపచేసుకున్న మోడీ ఈ బిల్లుపై కాస్త లేటుగా అయినా దృష్టి పెట్టడం సంతోషకరమైన పరిణామం గానే చెప్పాలి .
ఈ బిల్లు చట్టంగా రూపొందితే మాత్రం దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పుకు ఇది నాంది పలుకుతుందని, రాజకీయాలలో జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు.
రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపి ఇలాంటి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యలు వినిపించినా రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు కోసం పని చెయ్యడం తప్పు కాదని , అయితే దేశ ప్రయోజనాలకు కూడా పెద్దపీట వేసే ఇలాంటి బిల్లుల విషయంలో రాజకీయ ప్రయోజనం కోసం చేసినా అంతిమంగా మేలు జరిగేది దేశ ప్రజలకే అంటూ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏది ఏమైనా తాను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ఎంతో కొంత వ్యతిరేకత మూట కట్టుకునే మోడీ ఈ నిర్ణయానికి మాత్రం పూర్తిస్థాయి ఆమోదముద్ర దేశవ్యాప్తంగా వేయించుకోవడం తో మోడీ కీర్తి కిరీటంలో ఇదొక కలికితురాయిగా మిగిలిపోతుందటంలో సందేహం లేదు
.
అదానిపై బాబు చర్యలు తీసుకుంటారా ? ఒత్తిడి పెరుగుతోందా ?