రంగంలోకి ముగ్గురు యువ హీరోలు.. హిట్టు కొట్టకపోతే కష్టమే !
TeluguStop.com
కరోనా తర్వాత కాస్తో కూస్తో కుదుటపడుతున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆగస్టు నెల సైతం బాగా కలిసి వచ్చింది.
బింబిసారా, సీతా రామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్స్ గా నిలవడంతో మరోమారు టాలీవుడ్ కి పండగ వాతావరణం వచ్చింది.
ఆ తర్వాత సెప్టెంబర్ మాసం మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదని చెప్పాలి.
సెప్టెంబర్ లో విడుదలైన అన్ని సినిమాలు దాదాపుగా ఫ్లాప్ టాక్ ని మూట కట్టుకున్నాయి.
ఇక శర్వా నటించిన ఒకే ఒక జీవితం మాత్రమే కాస్త కూసో పరవాలేదు అనిపించింది.
ఇక ఈనెల వారాంతంలో మరో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముగ్గురు హీరోలు రంగంలోకి దూకుతున్నారు వారే నాగశౌర్య, శ్రీ విష్ణు, శ్రీ సింహా.
నాగశౌర్య హీరోగా నటించిన కృష్ణ విందా విహారి సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులందరికీ రానుంది.
ఈ చిత్రంలో షిర్లీ సేఠియా హీరోయిన్ గా నటించింది.దీనికి ఆర్ కృష్ణ దర్శకత్వం వహించగా ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం గా తెరకెక్కింది.
ఈ సినిమాలో నాగశౌర్య బ్రాహ్మణుడు పాత్రలో కనిపించనున్నాడు.చాలా రోజులుగా వరస పరాజయాలను మాత్రమే చూస్తున్న నాగశౌర్యకి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక విభిన్నమైన కథలతో ఎప్పుడూ ప్రేక్షకులను సరికొత్తగా పలకరించే హీరో శ్రీ విష్ణు.
"""/"/కెరియర్ లో కొన్ని ప్లాపులుప్పటికీ వైవిధ్యమైన హీరో గానే అతనికి మంచి గుర్తింపు పొంది.
తరుణంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇప్పటివరకు కమర్షియల్ బ్రేక్ అందుకోని శ్రీవిష్ణు ఈ చిత్రంతోనైనా కమర్షియల్ హీరోగా గుర్తింపు పొందాలని తహతలాడుతున్నాడు.
అర్జున పాల్గుణ, భళా తందనాన సినిమాలతో నిరాశలో ఉన్న శ్రీ విష్ణు కి అల్లూరి సినిమా విజయం తప్పనిసరి.
"""/"/
ఇక కీరవాణి తనయుడైన శ్రీ సింహా మొదట మత్తు వదలరా అనే చిత్రంలో పరిచయం అయ్యాడు.
ఈ చిత్రంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత తెల్లవారితే గురువారం సినిమాతో ఫ్లాప్ ని చూశాడు శ్రీ సింహ.
ఇక మూడో సినిమాగా దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు సింహ.
దొంగతనానికి వెళ్లి కార్ లో ఇరుక్కొని ఎలా కష్టాలు పడ్డాడో చెప్పే పాత్రలో శ్రీ సింహ బాగా నటించినట్టుగా తెలుసుతుంది.
మరి ఈ చిత్రం విజయం సాధిస్తే తప్ప అతడికి గుర్తింపు ఉండే అవకాశం లేదు.
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?