ఆ సినిమాని రీమేక్ చేయాలని ఉందంటున్న నిఖిల్… కానీ
TeluguStop.com
తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రతి మంగళవారం రాత్రి 9.
30 నిమిషాలకు ప్రసారమయ్యేటువంటి "ఆలీతో సరదాగా" కార్యక్రమంలో ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రిటీ తో ఆలీ సందడి చేస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.
అయితే తాజాగాఆలీ ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ని ఆహ్వానించాడు.
దీంతో షో కి సంబంధించినటువంటి ప్రోమో వీడియో ని షో నిర్వాహకులు ఇటీవలే యూట్యూబ్ లో విడుదల చేశారు.
అయితే ఇందులో వ్యాఖ్యాత ఆలీ నీకు టాలీవుడ్ లో ఏదైనా చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే ఏ చిత్రాన్ని రీమేక్ చేస్తావని అడగ్గా హీరో నిఖిల్ తనకు టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, స్వర్గీయ అందాలతార నటి శ్రీ దేవి జంటగా నటించిన "క్షణ క్షణం" అనే చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని తన మనసులో మాటని బయట పెట్టాడు.
కానీ చివర్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ గురించి అడగబోతుండగా సడన్ గా నిఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
దీంతో అసలు ఏం జరిగిందనే విషయం తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో హీరో నిఖిల్ తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నాడు.
అయితే ప్రస్తుతం తెలుగులో నిఖిల్ కార్తికేయ - 2 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే 18 పేజెస్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!