ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ప్రస్తుతం…

తెలుగులో ప్రముఖ దర్శకుడు రసూల్ ఏలూరు దర్శకత్వం వహించిన "ఒకరికి ఒకరు" చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ ఆర్తి చాబ్రియా తన నటనతో తెలుగు ప్రేక్షకులని బాగానే అలరించింది.

అయితే ఆర్తి చాబ్రియా తెలుగు లో నటించింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

కాగా ఆర్తి చాబ్రియా ముంబై నగరంలో పుట్టి పెరిగింది.దీంతో ఈమె మొదటగా బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో వహించిన లజ్జ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది.

ఆ చిత్రం అప్పట్లో మంచి హిట్ అవడంతో వరుస అవకాశాలతో బాగానే రాణించింది.

అంతేగాక తెలుగు, పంజాబీ, కన్నడ, హిందీ, తదితర భాషలలో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది.

అయితే  ఆ మధ్య కాలంలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో అవకాశాలు దక్కించుకో లేకపోయింది.

దీంతో వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.ఈ క్రమంలో విశారద్ అనే ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించి ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుంది.

దీంతో ప్రస్తుతం ఆర్తి చాబ్రియా ఒకపక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూనే మరోపక్క తన భర్తకు చేదోడుగా నిలుస్తోంది.

 కాగా ప్రస్తుతం ఆర్తి చాబ్రియా తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

కాగా తెలుగులో ఆర్తి చాబ్రియా నటించిన గోపి, ఒకరికి ఒకరు, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

  టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినటువంటి చింతకాయల రవి చిత్రంలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో ఆర్తి నటించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 21, బుధవారం 2024