కేటీఆర్‌పై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు.. ఉన్నట్లుండి ఎందుకు ఇంత అభిమానం పుట్టుకు వచ్చిందో?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలను జరుపుకుంటున్నాయి.

ఈ సమయంలోనే తెలుగు సినీ ప్రముఖులు పదుల సంఖ్యలో కేసీఆర్‌ మరియు కేటీఆర్‌లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినీ ప్రముఖులు దాదాపుగా అంతా కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్‌ మీడియా ద్వారా, వెబ్‌ మీడియా ద్వారా ఏదో ఒక విధంగా తమ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఓడిపోవాలని కొందరు కోరుకున్నారని, వారు ప్రజా కూటమికి ధన సాయం కూడా చేశారు అంటూ వార్తలు వచ్చాయి.

కాని ఎన్నికల ఫలితాలు రావడమే ఆలస్యం వెంటనే కేసీఆర్‌ మరియు కేటీఆర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉన్నట్లుండి కేటీఆర్‌ మరికు కేసీఆర్‌లకు ఇంతగా శుభాకాంక్షలు తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

కొందరు మాత్రం ఏదో అంతరార్థం ఉండే ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సినీ వర్గాల్లో ఎక్కువ శాతం మందికి కోపంగానే ఉంది.

కారణం నంది అవార్డులు ఇవ్వక పోవడంతో పాటు, సినీ పరిశ్రమకు ఏమాత్రం ప్రోతాహకాలు ఇవ్వక పోవడం.

దానికి తోడు ఆంధ్రా వారు అంటూ సినీ పరిశ్రమ వారిని ఇబ్బంది పెడుతూ వస్తారు.

అందుకే ప్రభుత్వంతో మంచిగా ఉండి, కేటీఆర్‌ దృష్టిలో మంచి ఉద్దేశ్యంతో పడితే తప్పకుండా భవిష్యత్తులో లాభం చేకూరకున్నా నష్టం మాత్రం జరుగకుండా ఉంటుందని అంతా కూడా కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా లేదంటే ఇతరత్ర సోషల్‌ మీడియాల ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!