అవును…. నా భర్తతో విడాకులు తీసుకోవడం వల్లే నా కెరియర్ దెబ్బతింది….

అవును…. నా భర్తతో విడాకులు తీసుకోవడం వల్లే నా కెరియర్ దెబ్బతింది….

తెలుగులో ఒకప్పుడు తన గలగల మాటలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న "ప్రముఖ తెలుగు సీనియర్ యాంకర్ ఝాన్సీ" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అవును…. నా భర్తతో విడాకులు తీసుకోవడం వల్లే నా కెరియర్ దెబ్బతింది….

 ఒకప్పుడు ఝాన్సీ ఒక పక్క తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోపక్క తన నటనతో కూడా సిల్వర్ స్క్రీన్ పై కూడా సందడి చేసింది.

అవును…. నా భర్తతో విడాకులు తీసుకోవడం వల్లే నా కెరియర్ దెబ్బతింది….

ఈ క్రమంలో అమ్మ, అక్క, చెల్లి, తదితర పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది.

ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ సినీ నటుడిని పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లయిన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు పోరాడి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.

 తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను తన  జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ క్రమంలో తనకి పెళ్లయిన కొంతకాలానికి తన భర్తకి తనకి మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని అందువల్లనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కూడా స్పష్టం చేసింది.

 అయితే తాను విడాకులు తీసుకున్న తర్వాత సినీ కెరీర్ పరంగా కొంతమేర డౌన్ అయ్యానని చెప్పుకొచ్చింది.

దీంతో కొందరు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు తనకి సహాయం చేసేందుకు వచ్చినప్పటికీ తాను మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపింది.

అంతేగాక సమాజంలో ఒంటరి మహిళ కష్టాలను ఎలా అధిగమించాలనే విషయంపై తనకు పూర్తిగా క్లారిటీ గా ఉందని అందువల్లనే తాను ఇతరుల సహాయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

అయితే తన భర్త గురించి మాత్రం మాట్లాడటానికి యాంకర్ ఝాన్సీ ఇష్టపడలేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ ఝాన్సీ పలు టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఆ మధ్య కాలంలో యాంకర్ ఝాన్సీ నటించినటువంటి ఎఫ్ 2, భాగ్య నగర వీధుల్లో, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

కొల్లగొట్టినాదిరో…పవన్ కళ్యాణ్ తో అనసూయా… వీడియో వైరల్!