NTR Mahesh Pawan Kalyan: మహేష్ బాబు, తారక్, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్స్ చూసారా ?

తెలుగు లో కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే ఇక ఫ్యాన్స్ కి పండగే.

ఏ హీరో ఏ దర్శకుడితో పని చేస్తున్నాడు, సినిమా కు టైటిల్ ఏంటి, హీరోయిన్ ఎవరు, ఏ ప్రొడక్షన్ కంపెనీ నుంచి సినిమా వస్తుంది అంటూ ఎన్నో విషయాల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంత వెతుకుతూ ఉంటారు.

సినిమా గురించి వచ్చే ప్రతి అప్ డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక ఇదంతా చాలదు అన్నట్టు ఒకే టైం లో విడుదల అయ్యే సినిమాల విషయంలో సదరు హీరో ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.

అయితే ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు, వాటి ఆసక్తికర టైటిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

H3 Class=subheader-styleమహేష్ బాబు - గుంటూరు కారం/h3p """/" / మహేష్ బాబు త్రివిక్రమ్( Mahesh Trivikram ) కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఇప్పటికే చాల టైటిల్స్ వాడకం లో ఉన్నాయ్.

మొదట్లో అమరావతి కి అటు ఇటు, వూరికి మొనగాడు అంటూ పలు పేర్లు వినిపించిన అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం( Guntur Kaaram ) టైటిల్ దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది.

ఇలాంటి మాస్ టైటిల్స్ తో ఇప్పటి వరకు మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాలేదు .

దాంతో ఈ సారి మహేష్ మాములుగా కాకుండా మాస్ కా బాప్ లా ఉండబోతున్నారు అంటూ ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు.

H3 Class=subheader-styleపవన్ కళ్యాణ్ - బ్రో/h3p """/" / పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పటికే అనేక సినిమాల్లో నటిస్తున్నాడు.

అందులో ఒకటి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న సినిమాకు బ్రో ( Bro ) అనే టైటిల్ ఫిక్స్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా సముద్రఖని దర్శకత్వం లో వచ్చిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

H3 Class=subheader-styleజూనియర్ ఎన్టీఆర్ - దేవర/h3p """/" / తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు దేవర ( Devara )అనే ఒక టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇప్పటి వరకు టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ తారక్ ( NTR ) అభిమానులు మాత్రం ఈ పేరుతో ఇప్పటికే హడావిడి చేస్తున్నారు.

రన్నింగ్ ట్రైన్ బయటకు వచ్చి రీల్స్ చేసిన యువతి.. పోల్‌ తనకు తగలడంతో..?